కావల్సిన పదార్థాలు:
పన్నీర్: : 200 గ్రాములు
పచ్చిమిర్చి: 2-4
ఉల్లిపాయ: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
టమోటో: 1
మేథి (మెంతి ఆకులు): 2కట్టలు
ధనియాల పొడి : 1 టీ స్పూను
కారం: 1/2 టీ స్పూను
పసుపు: 1 తగినంత
గరం మసాలా: 1టీ స్పూను
పాలు: 2టేబుల్ స్పూన్
ఫ్రెష్ క్రీమ్: 1 కప్
పన్నీర్: 1టీ స్పూను
నెయ్యి: 1 నూనె: 1టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత మంట తగ్గించి అందులో పన్నీర్ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించుకొని, పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి రెండు మూడు నిముషాలే వేయించి, తర్వాత టమోటో, ఉప్పు వేసి బాగా కలుపుతూ ఐదునిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
ఇప్పుడు అందులోనే శుభ్రం చేసుకొన్న మెంతి ఆకులను కూడా వేసి బాగా కలుపుతూ తక్కువ మంటమీదా బాగా మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు మసాలా ధినుసుల పొడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కారం, పసుపు, గరంమసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిముషాలు వేయించాలి. ఇప్పుడు అందులోనే పాలు మరియు క్రీమ్ కూడా మిక్స్ చేసి మరో ఐదారు నిముషాల పాటు వేయించుకోవాలి. ఈ మసాలా పొడులన్నీ పచ్చవాసన పోయేంత వరకూ ఉడికించిన తర్వాత అందులో పెప్పర్ పౌడర్ మరియు వేయించి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలను వేసి, గ్రేవి చిక్కబడేవరకూ ఉడికించుకోవాలి. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆప్
మరింత సమాచారం తెలుసుకోండి: